‘‘ఇందులో లాజిక్ తప్పింది సర్’’ అన్నారొక రీడర్ ఫోన్ చేసి! పై కథ చదివాక.
అప్పటికింకా మధ్యాహ్నమే. పేపర్‌లు మార్కెట్‌లోకి వచ్చి అప్పటికి ఐదారు గంటలు అయుంటుంది.
అంతలోనే ఒక రీడర్ ఈ కథను (హారర్ బిగిన్స్..) చదివేయడం, ఆఫీస్‌కి ఫోన్ చేయడం, వాళ్లిచ్చిన నెంబర్ పట్టుకుని నాకు ఫోన్ చేయడం, ‘‘ఇందులో లాజిక్ తప్పింది సర్’’ అనేయడం.. ఇన్ని జరిగాయంటే, ప్రపంచాన్ని మనం కొంతమందిమి నిందిస్తున్నట్లుగా.. అందరూ వాట్సాపుల్లో ఏమీ మునిగి తేలడం లేదు.
పేపర్లు చదివేవారున్నారు. ఆ పేపర్‌లతో పాటు ఆదివారం పూట వచ్చే అనుబంధాల పుస్తకాలను తిరగేసేవారున్నారు. వాటిల్లో వచ్చే కథలతో పాటుగా, దెయ్యాల కథల్ని కూడా సీరియస్‌గా తీసుకునేవారూ ఉన్నారు!!
సో.. రామ్ సర్ కరెక్టే.
రామ్ సర్ అప్పుడు మా ఫీచర్స్ ఎడిటర్.
సాక్షి ‘ఫ్యామిలీ’, సాక్షి ‘ఫన్‌డే’, సాక్షి ‘సినిమా’ వీటిన్నిటికీ కలిపి ఆయన హెడ్డు. హెడ్డు కనుక..‘నువ్విది రాయి’ అంటే మనం అది రాయాల్సిందే.
‘‘దెయ్యం కథల్ని నువ్వు రాయి’’ అన్నారు నన్ను ఆయన.
‘నేను రాయను’ అనలేను కనుక.. ‘‘ఫన్ డేలో మనం దెయ్యాల కథల్ని వేస్తే రీడర్స్ పేజ్ తిప్పేస్తారేమో సార్..’’ అని మాత్రం అనగలిగాను.
‘‘రాసేలా రాస్తే ఎందుకు తిప్పేస్తారు?’’ అన్నారాయన.
రాసేలా రాయలేనని నాపై నాకు నమ్మకం. ఆ మాటే రామ్ గారితో అన్నాను.. ‘రాయలేను సర్..’’ అని.
ఆనాటి దెయ్యాల మీటింగ్‌లో (దెయ్యాల కథల్ని ప్రారంభించేందుకు జరుగుతున్న డిస్కషన్ మీటింగ్‌లో).. భాస్కర్ గారు, ఖదీర్ గారు, యాసిన్ సర్, యాకూబ్ గారు.. మరికొందరు మిగతావాళ్లు ఉన్నట్లు గుర్తు.
రామ్ గారిలో ఒక సుగుణం ఉంది. ఆయన తన ఇగోను ఏమాత్రం హర్ట్ కానించుకోరు.
‘యు డు’ అని ఆయన అన్నారంటే.. డు డిడ్ అవాల్సిందే. డిడ్ డన్ అవాల్సిందే.
ఆ రోజు కూడా రామ్ గారు ‘యు డు’ అన్నారు కానీ, నేను చేతులెత్తేశాను.
ఆ టైమ్‌లో ఆయన ఇగోను కాపాడే బాధ్యతను అర్జెంటుగా ఎవరో ఒకరు తీసుకోవడం అవసరం అని ఖదీర్‌గారు గ్రహించినట్లున్నారు.. తనే చొరవగా ఆ బాధ్యతను తన స్వహస్తాల్లోకి తీసుకున్నారు. అంటే.. ‘దెయ్యం కథల్ని నేను రాస్తాను సర్’ అని కాదు. దెయ్యం కథల్ని నా చేత రాయించేందుకు బంతిని స్పిన్ చేయడం!
ఖదీర్ గొప్ప ఆటగారు.
ఆయనేం చేశారో చూడండి.
‘‘మాధవ్ దెయ్యం కథల్ని భలే రాస్తాడు సార్. ఫ్యామిలీలో మాధవ్ ఆ మధ్య ఒక దెయ్యం కథ రాస్తే, విజయవాడ ఎడిషన్‌లో ఒక సబ్ ఎడిటర్ అది చదివి, ఆ రాత్రి డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్లడానికి భయపడ్డాడట..’’ అని రామ్ గారితో అని, ‘‘మీరు తప్ప దెయ్యం కథల్ని ఇక్కడ ఎవరూ రాయలేరు..’’ అని నా వైపు తిరిగి అన్నారు! ఇక్కడ అంటే హైదరాబాద్‌లో అని కాదు. హైదరాబాద్‌లో ఉన్న సాక్షి హెడ్ ఆఫీస్‌లో అని కాదు. ఆ దెయ్యాల మీటింగులో ఉన్నవాళ్లెవరూ రాయలేరని.
రామ్ గారిలో ఉన్నట్లే ఖదీర్‌గారిలోనూ ఒక సుగుణం ఉంది.
నిజం చెప్పి ఎవర్నీ సంతోషపెట్టరు. అబద్ధం చెప్పి ఎవర్నీ బాధపెట్టరు. ఆ రోజు మాత్రం రామ్ గారి ఇగోను సంతోషపెట్టడానికి నిజమో, అబద్ధమో చెప్పి ఉంటారని నాకనిపించింది.
అలా నేను ఫన్ డేలో వారం వారం దెయ్యం కథలు రాయడం మొదలైంది. ప్రారంభ కథే ఈ.. ‘హారర్ బిగిన్స్’.
‘‘ఇందులో లాజిక్ తప్పింది సర్’’ అన్నారొక రీడర్ ఫోన్ చేసి! దెయ్యాల కథల్లోని ఈ ప్రారంభ కథ.. ‘హారర్ బిగిన్స్..’ చదివి.
‘‘దెయ్యాలు ఎలా ఉంటాయో చూడాలని ఒక దెయ్యం అనుకోవడం ఏమిటి? అందుకోసం శ్మశానాలు, పాడుబడిన ఇళ్లలో తిరగడం ఏమిటి? దెయ్యాలను చూపించమని భూత వైద్యుడిని కలవడం ఏమిటి!.. నో లాజిక్..’’ అని ఆ రీడర్.
‘‘దెయ్యాలు ఎలా ఉంటాయో చూడాలని అన్వేషించే క్రమంలో ఒక మనిషి శ్మశానంలోనో, పాడుబడిన ఇంటిలోనో దెయ్యాన్ని చూసి, గుండె ఆగి చనిపోయి, ఆ తర్వాత దెయ్యమై, దెయ్యం అయిన తర్వాత కూడా తనింకా మనిషినేననుకుంటూ దెయ్యాల కోసం తన అన్వేషణను కొనసాగించాడని అనుకోవచ్చు కదా.. కేవలం లాజిక్ కోసమైతే..’’ అని నేను ఆ రీడర్‌తో అనలేదు.
‘‘నిజమే లాజిక్ తప్పింది..’’ అన్నాను.
‘‘లాజిక్ తప్పినా కథ బాగుందనిపించింది’’ అన్నారు ఆ రీడర్.
బాగుందా?! బాగుందనిపించిందా?!
లైఫ్‌లో కొన్ని ఇలాగే ఉంటాయి. ‘అనిపించినట్లు, ‘అనిపించనట్లు’ అని మాత్రమే చెప్పగలిగేటట్లు.

(మరో దెయ్యం కథ మళ్లెప్పుడైనా.. కాస్త టైమ్ దొరికినప్పుడు)

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home