‘‘ఈ అబ్బాయిలేంటో.. స్నేహాన్ని ప్రేమ అనుకుంటారు’’ అని నవ్వింది, బ్యాక్ హుక్స్ పెట్టుకుంటూ.
‘‘అమ్మాయిలు కూడా..’’ అని నవ్వాడు యశ్వంత్ అలసటగా.
ఈ సందర్భం.. పై ‘అల’ కథ లోపలిది. దీని గురించి ఓ రీడర్ ఫోన్ చేశారు.
‘‘కావలించుకోడానికి, బ్యాక్ హుక్స్ పెట్టుకోడానికి మధ్య అనివార్యంగా ఉండే సమయాన్ని మీరు చిన్న ఇండికేషన్‌తోనైనా రిజిస్టర్ చెయ్యలేదు. స్కిప్ చేసేశారు. రీడర్స్‌కి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది కదా!’’ అని!
ఆ మాట నిజం.
జనరల్‌గా.. కావలించుకున్నాక ఆ తర్వాత జరగబోయే పరిణామాల క్రమంలో.. (ఈ కథ ప్రకారం).. హుక్స్ తియ్యడం ఉంటుంది తప్ప, హుక్స్ పెట్టుకోవడం ఉండదు. అయితే.. హుక్స్ పెట్టుకోవడం అని ఎందుకు రాయడం అంటే కొంత సమయం గడిచిందని చెప్పడం కోసమే. అది సరిగ్గా కన్వే కాదేమో అని.. రాసేటప్పుడు అనిపిస్తూనే ఉంది కూడా.
దాన్ని కాంపెన్సేట్ చెయ్యడం కోసం ఆ వెంటనే.. యశ్వంత్ అలసటగా నవ్వాడు అని రాయవలసి వచ్చింది. అయితే ఆ ‘అలసట’ కూడా కన్వే చేసినట్లు లేదు!
‘ఐదు నిముషాల తర్వాత ఆమె హుక్స్ పెట్టుకుంటూ’ అని రాయాలని అనుకున్నా.. అసలు నిముషాల లెక్క ఎందుకు అని అనిపించడం అలా రాయకపోవడానికి కారణం.
ఇవన్నీ ఒక ఎక్స్‌ప్లనేషన్‌గా ఆ రీడర్‌తో చెప్పినప్పుడు.. ‘‘ఇట్స్ ఓకే. కానీ ఓ చోట గుండె ఝల్లుమంది తెలుసా?’’ అని నవ్వారు.
నాకు తెలియకుండానే కథల డెవిలీకరణ మెల్లిగా మొదలైందన్నమాట!
రామ్ సర్ ఆత్మ శాంతించడం కూడా :)
(మరో దెయ్యం కథ మళ్లెప్పుడైనా.. కాస్త టైమ్ దొరికినప్పుడు)




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home